The Nagpur Mumbai Duronto Express has derailed near Titwala. The incident at Maharashtra took place on the wee hours of Tuesday. The incident took place near the Kasara Ghat section. <br /> <br />రైల్వేలో వరుస ప్రమాద ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరో రైలు పట్టాలు తప్పడంతో.. రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున నాగ్‌పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని తిత్వాల స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటనలో మొత్తం 7భోగీలు పట్టాలు తప్పగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు పట్టాల పైకి బురద, రాళ్లు వచ్చి చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. <br />