Saaho movie first look released on eve of Prabhas birthday event. Reports suggest that This first look is copied from Hollywood movie Blade Runner. Saaho story is based on reincarnation. <br />బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వా త ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. అక్టోబర్ 23వ తేదీన యంగ్ రెబల్‌స్టార్ బర్త్ డే పురస్కరించుకొని సాహో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే అభిమానులు విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ ఫస్ట్ లుక్ ఓ హాలీవుడ్ సినిమా పోస్టర్‌ను కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. <br />తాజాగా రిలీజ్ అయిన సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ బ్లేడ్ రన్నర్ చిత్రం నుంచి కాపీ కొట్టారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నది. అందుకు సాక్ష్యంగా నిలిచిన బ్లేడ్ రన్నర్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. <br />బ్రేడ్ రన్నర్ చిత్రంలో మాదిరిగానే హీరో నల్లటి కోట్ వేసుకొని వచ్చే సన్నివేశం తాజాగా రిలీజ్ చేసిన సాహో పోస్టర్‌ను పోలి ఉండటంతో కాపీ అనడానికి బలమైన నమ్మకం కలిగింది.