Surprise Me!

Venky New Movie Title Funny Discussion ఇదేం వింత టైటిల్ వెంకీ..!

2017-10-27 461 Dailymotion

Victory venkatesh new movie title is ee nagaraniki yemaindi ddirected by teja, the movie is doing in suresh productions banner. <br />సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రామానాయుడు మరణం తరువాత గురు సినిమా మాత్రమే చేసిన వెంకీ.. మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకొని తేజ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు.ఈ మధ్యనే ఆత్యాద్మిక యాత్రలు కూడా చేశాడట. అయితే మొన్నటి వరకు వెంకీకి చాలా కథలు వచ్చాయి. ఏ సినిమాను పట్టాలెక్కించాలనే విషయం పై చాలా ఆలోచనలు జరిపి చివరగా తేజ చెప్పిన ఒక స్టోరీని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్దమయ్యాడు. <br />రానా హీరో గా నేను రాజు నేనే మంత్రి లాంటి భారీ హిట్ సాధించిన తేజ మరోసారి అదే బ్యానర్ లో అదే ఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తున్నాడు. <br />నవంబర్ 16న మొదలు పెట్టి సినిమాను బ్రేక్ లేకుండా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట. అయితే రీసెంట్ గా ఆ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్ ఫైనల్ చేశారన్న వార్త వినిపిస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో 'ఈ నగరానికి ఏమైంది..?' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నారు ? "ఈ నగరానికి ఏమైంది'? <br /> ఈ యాడ్ పై స్పూప్ లు చాలానే వచ్చాయి.అయితే వెంకటేష్ సినిమాతోపాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ మరో సినిమాను కూడా నిర్మిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. మరి ఈ రెండింటిలో ఈ ఆసక్తికర టైటిల్ ఏ సినిమాకు ఫిక్స్ చేస్తారో మరి. తేజ వెంకీ ని ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.

Buy Now on CodeCanyon