Revanth Reddy resignation letter of MLA post is still at AP CM Chandrababu Naidu, is it strategical? <br />తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి లేఖ ఇంకా స్పీకర్ కు చేరలేదని తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్ లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆ లేఖ ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు వద్దనే ఉన్నట్టు సమాచారం. <br />అమరావతిలో చంద్రబాబును కలిసిన సందర్భంగా రేవంత్ తన రాజీనామా లేఖను అందజేశారు. లేఖను నేరుగా స్పీకర్ కు పంపించకుండా చంద్రబాబుకు అందజేసి రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆ లేఖను తిరిగి తెలంగాణ స్పీకర్ కు పంపిస్తారా? లేరా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. <br />నవంబర్ 2 వరకూ తన వద్దే రేవంత్ రాజీనామాను ఉంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్ కు వచ్చి తెలుగుదేశం నేతలతో సమావేశమై, రేవంత్ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. తెలంగాణకు చెందిన టీడీపీ నాయకుల ద్వారా రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించే అవకాశాలున్నాయి.
