Rajasekhar's house tragedy An elder brother Murali Srinivas died shortly thereafter. Murali suffered from some illness for some time and finally came to the last breath in the early morning. <br />హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఆయన తల్లి మరణించగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే, ఈ తెల్లవారుఝామున జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది మురళీ శ్రీనివాస్ హైదరాబాదులో కన్నుమూశారు. గతజూన్ లోనే కిడ్నీ సంబందిత సర్జరీ జరిగింది అప్పటినుంచీ ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. <br />2011 లో డ్రగ్స్ మాఫియాలో కూడా మురళీ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపించింది. 305 గ్రాముల కొకైన్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మురళీ శ్రీనివాస్ ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించలేదు. <br />కాగా, రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. <br />ఈ సమయంలో కుటుంబంలో విషాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.