The International Cricket Council today gave a clean chit to India skipper Virat Kohli who was seen using a walkie talkie during the first T20 International against New Zealand in Delhi. <br />మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కివీస్‌పై పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. <br />అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. డగౌట్‌లో జట్టు సభ్యులతో కూర్చున్న కోహ్లీ వాకీ టాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడంటూ నెటిజన్లు మండిపడ్డారు. <br />