Director Trivikram Srinivas doing a movie with Young Tiger NTR. This movie is caught in many rumours. In this situation, Trivikram given clarity about all the gossips which rounding in film nagar. <br />యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై సూపర్ క్రేజ్ నెలకొన్నది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా ప్రారంభమైన ఈ చిత్రంపై అనేక రూమర్లు ఫిలిం సర్కిళ్లలో షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఆ చిత్రంపై వస్తున్న అన్ని రకాల గాసిప్స్‌కు త్రివిక్రమ్ తెరదించారు. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. <br />ఈ మధ్య నితిన్, సమంతతో తీసిన ఆ ఆ చిత్రం కొంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ స్పందించి ఆ రచయిత్రికి క్రెడిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. <br />సరిగ్గా ఆ ఆ చిత్రానికి సంబంధించిన వార్త మాదిరిగానే తాజాగా మరో వార్త తెరమీదకు వచ్చింది. 80 దశకంలో బాగా పాపులర్ అయిన ఓ నవలను భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నాడు అనే వార్త వైరల్‌గా మారింది. దాంతో త్రివిక్రమ్ తన సన్నిహితుల వద్ద స్పందించాల్సి వచ్చిందట.