Surprise Me!

Star Comedian Sensational Comments On Balayya బాలయ్యని అలా అనేశాడేంటి

2017-11-07 3,933 Dailymotion

టాలీవుడ్‌లో వీర లెవెల్లో డైలాగ్ కొట్టాలంటే బాలకృష్ణకే సాధ్యమంటారు ఆయన అభిమానులు. నరసింహనాయుడు, లెజెండ్, సింహా, పైసా వసూల్ లాంటి చిత్రాలు ఆయన డైలాగ్ సత్తాకు అద్దంపట్టాయి. 'నీకు కావాల్సి నేను. నాతో పెట్టుకో. పది మందితో రా.. పదికి పది పెంచుకొంటూరా.. కానీ జనంతో పెట్టుకోకు', 'కొడితే మెడికల్ టెస్టులకు మీ ఆస్తులు అమ్మినా సరిపోవు', 'ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్, అదర్స్ నాట్ అలౌడ్' అంటూ బాలక‌ృష్ణ కొడితే థియేటర్లలో చప్పట్లు మోగాల్సిందే. ఫైట్స్ చేయడంలో బాలకృష్ణది డిఫరెంట్ స్టయిల్. <br />బాలకృష్ణకు కేవలం ప్రేక్షకులే కాదు. హీరోలు, కమెడియన్లు కూడా అభిమానులుగా ఉన్నారు. అందుకు సాక్ష్యంగా తమిళ స్టార్ కమెడియన్ వివేక్‌ను చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గురించి తాజాగా వివేక్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు వివేక్ ఏమన్నారంటే.. <br />నా మనసు బాగా లేకుంటే నేను రెండు పనులు చేస్తాను. ఒకటి స్వామి వివేకానంద పుస్తకాలు చదువుతాను. రెండు బాలకృష్ణ డైలాగులు వింటాను, ఫైట్స్ చూస్తాను. ఈ రెండు నాకు మంచి ఎనర్జీని ఇస్తాయి అని వివేక్ ట్వీట్ చేశారు. <br />వివేక్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తున్నది. ఆయన ట్వీట్ 1200 సార్లు రీట్వీట్ అయింది. సుమారు 10 వేల మంది లైక్ చేశారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి. బాలకృష్ణ అంటే మరీ అంతే..

Buy Now on CodeCanyon