Surprise Me!

Ryan School Pradyumn’s Case : Too Many Questions Remain Unanswered

2017-11-09 1 Dailymotion

The charges came hours after the Central Bureau of Investigation (CBI) detained a Class 11 student of the same school and said the older boy committed the harm to get examinations and a parent-teacher meeting postponed. <br />ప్టెంబర్ 8న గురుగ్రామ్‌లోని రియాన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమన్‌ హత్యకు గురవడం ఢిల్లీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రద్యుమన్‌ హత్యకు సంబంధించి తొలుత స్కూల్ బస్ కండక్టర్ పై ఆరోపణలు వచ్చాయి. <br />తాను అసహజ శృంగారానికి పాల్పడుతున్న సమయంలో చూసినందువల్లే ప్రద్యుమన్‌ను కండక్టర్ హత్య చేసి ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ తాజా సీబీఐ దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. 11వ తరగతి చదువుతున్న విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేసినట్టు నిర్దారించారు. <br />స్కూల్ బస్ కండక్టరుపై ఆరోపణలు రావడంతో పోలీసులు తొలుత అతన్ని విచారించారు. కానీ అతని నుంచి ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. స్కూలు ఆవరణలోని సీసీ టీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించారు.ప్రద్యుమన్‌ హత్యకు ముందు ఆ బాత్‌రూమ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరిగినవారిని గుర్తించారు. టీచర్లను, విద్యార్థులను, సిబ్బందిని కూడా విచారించారు. చివరకు 11వ తరగతి విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేశాడని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాళ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.

Buy Now on CodeCanyon