Vidya Balan is seen posing in PM Narendra Modi's personal tent at the Rann Utsav in Gujarat.She has been on a promotions spree off late. The actress is all set to entertain the audience yet again with her upcoming film Tumhari Sulu. <br /> <br />గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది. ఈ బాలీవుడ్ భామ సురేష్ త్రివేణి దర్శకత్వంలో తుమార్హీ సులు అనే చిత్రం చేసింది. ఈ మూవీ నవంబర్ 17న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్ కోసం రీసెంట్‌గా గుజరాత్ వెళ్లింది. ఈ సందర్భంగా గుజరాత్ పర్యాటక శాఖ ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ టెంట్ ని కేటాయించారు. <br />ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్ రూమ్‌లు ఉన్నాయి. వాస్తవానికి ఈ టెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కేటాయిస్తారట. . విద్యా ప్రస్తుతం తన సినిమా సినిమా ఈనెల 17న "తుమ్హారీ సులు" ప్రేక్షకుల ముందుకు రానుందిని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేసుకొనే పనిలో పడింది. <br />ఇటీవల సల్మాన్ బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి అక్కడ సినిమాకి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంది.. దీనిపై ఆమె మాట్లాడుతూ, "ఆ టెంట్ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు అనిపించింది' అని చెప్పింది.