Surprise Me!

YS Jagan Padayatra : జగన్, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం

2017-11-11 362 Dailymotion

Scuffle took place between YSRCP cadre and YS Jagan's security in Padayatra at Potladurthi village <br /> <br />ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ శనివారం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ భద్రతా సిబ్బందికి, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాదయాత్రలో జగన్ తో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఎగబడటంతో సిబ్బంది వారిని నిలువరించారు. ఒకానొక దశలో సిబ్బంది వారిని తోసేయడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో సిబ్బందికి-కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారితీసింది. <br />జగన్ దగ్గరకు తమను అనుమతించలేదన్న కారణంతో కొంతమంది వైసీపీ నేతలు నిరసనకు దిగారు. కాగా, పోట్లదుర్తి గ్రామంలో జగన్ కు ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రతో ముందుకు కదిలారు. <br />ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్ లీక్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారిశ్రామికవేత్త పీవీపీ పేరు కూడా వినిపిస్తోంది. మారిషస్ లో ఓ కంపెనీని నెలకొల్పిన ఆయన.. అక్కడి నుంచి స్వదేశంలోని పలు కంపెనీలకు పెట్టుబడులు తీసుకొచ్చారన్న విషయం వెలుగుచూసింది. ఆ సొమ్ముతోనే వైసీపీ అధినేత జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లోను పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ప్యారడైజ్ పేపర్స్ లో వెల్లడైన సమాచారం సరైందేనని, అయితే తామెక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని పీవీపీ చెబుతుండటం గమనార్హం.

Buy Now on CodeCanyon