Surprise Me!

AP Assembly Winter Session : తెలంగాణే బెస్ట్: అసెంబ్లీ సమావేశాలపై AP సంచలనం

2017-11-15 622 Dailymotion

YSRCP MLA Adimulapu Suresh on Tuesday spoke to media about Andhra assembly meetings

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడమంటే సమయం వృథా చేసుకోవడమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డా. ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఇక్కడి శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.ఏపీలో తమ అసెంబ్లీకి వెల్లడం టైమ్ వేస్ట్ అని, తమకు మాట్లాడేందుకు ఐదు నిమిషాలు కూడా మైక్ ఇవ్వరని సురేష్ చెప్పారు. అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు.
ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం లభిస్తోందని చెప్పారు. అంతేగాక, ఇక్కడ శీతకాల సమావేశాలు ఇన్ని రోజులు జరుపుకోవడం విశేషమని అన్నారు.
ఏపీలో అయితే బడ్జెట్ సమావేశాలే 14రోజులు దాటనివ్వరని విమర్శించారు. ఇక్కడ ప్రతిపక్షంగా కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని, కానీ, ఏపీలో అన్నింటిని తట్టుకుని వైసీపీ ప్రతిపక్షంగా నిలబడుతోందని అన్నారు.
టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హార్డ్ క్యాష్ ఇవ్వడం లేదని, అంతా కాంట్రాక్టుల ద్వారా కమీషన్‌ను వారికి చేరవేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా సర్కారు సొమ్మునే చంద్రబాబు ఖర్చుపెట్టారని దుయ్యబట్టారు.

Buy Now on CodeCanyon