Telangana govt arranged a farewell meeting to retired DGP Sri Anurag Sharma on Tuesday at Pragati Bhavan <br /> <br />తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సేవలందించి ఇటీవలే పదవి విరమణ చేసిన అనురాగ్ శర్మను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. మంగళవారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనమైన సన్మానం ద్వారా ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అనురాగ్ శర్మ సేవలను ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్న అపోహలను, దుష్ప్రచారాలను అనురాగ్ శర్మ పటాపంచలు చేశారని కొనియాడారు. రాష్ట్రాన్ని సహనశీలంగా మార్చిన ఘనత ఆయకే దక్కుతుందని పేర్కొన్నారు. <br />అనురాగ్ శర్మ పర్యవేక్షణలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి అనురాగ్ శర్మ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ అని, తెలివి-సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. <br />డీజీపీగా అనురాగ్ శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. గత మూడున్నరేళ్లలో తెలంగాణ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును కూడా చూసి ఓటేయాలన్నామని గుర్తుచేశారు. చరిత్రలో ఇలాంటి సందర్భం లేదన్నారు