Surprise Me!

Jagan Padayatra : అంత ఆస్థి ఉంచుకుని, రూ.1లక్ష కోసం కక్కుర్తి ఎందుకు ? | Oneindia Telugu

2017-11-16 1,566 Dailymotion

Prashant Kishor and his team was stayed at a hotel in Kadapa for one month during Jagan's padayatra in district <br /> <br />పీకే టీమ్‌కు వైసీపీ నేతకు చెందిన ఓ హోటల్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర తీరు తెన్నుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు సలహాలు-సూచనలు అందిస్తోంది పీకే టీమ్.ఈ క్రమంలో కడప జిల్లాలోని ఓ హోటల్లో బస చేసిన సందర్భంగా.. బిల్లు విషయమై గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలు రంగంలోకి దిగి హోటల్ యాజమాన్యానికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగినట్టు సమాచారం. <br />ఇడుపులపాయ నుంచి నవంబర్ 6న జగన్ తన పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి 15రోజుల ముందే ప్రశాంత్ కిశోర్ టీమ్ కడపకు చేరుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో మకాం వేసి పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేసింది.నెల రోజుల పాటు అదే హోటల్లో మకాం వేసిన పీకే టీమ్.. పాదయాత్రకు సంబంధించి చాలానే కసరత్తులు చేసింది. ఎక్కడెక్కడా పార్టీ పట్ల ప్రజల స్పందన మెరుగ్గా ఉ:ది.. ఎక్కడ బలహీనంగా ఉందన్న అంశాలపై ఫోకస్ చేసింది. జగన్ పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇక్కడే రచించారు.

Buy Now on CodeCanyon