Surprise Me!

అబ్బో.. వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి !

2017-11-17 1,330 Dailymotion

Nandi Awards Controversy: Director Ramgopal Varma posted a settire on Nandi Award selection Commitee, About thair Award selection for 2017

2014, 2015, 2016 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను మంగళవారం ప్రకటించింది. అయితే అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ నేతలు తమకు కావాలసినవారికి, సీఎం చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గం వారికే అవార్డుకు ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు.
సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సంచలనాలకు కేరాఫ్‌‌ దర్శకుడిగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు స్పందించాడు. ఫేస్‌‌బుక్‌‌లో తనదైన శైలిలో వ్యంగ్యంగా వర్మ ఫోస్టు చేశాడు. అర్హత ఉన్న సినిమాలకు అవార్డులు దక్కలేదని.. అనర్హమైన సినిమాలకు పెద్ద పీట వేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి.. ప్రభుత్వంపై, నంది అవార్డుల కమిటీపై ధ్వజమెత్తుతూ సోషల్ మీడియాలో బోలెడన్ని పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి...
అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా...వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ ..నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు..
ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్" అంటూ వర్మ పోస్ట్ చేశాడు. ఇక మామూలుగానే ఈ పోస్ట్ కి కూడా మద్దతుగా, వ్యతిరేకంగా కామెంట్లు వచ్చిపడుతూనే ఉన్నాయ్.

Buy Now on CodeCanyon