Surprise Me!

27సెం.మీ పొడవున్న పురుగు, అతని శరీరం నిండా పురుగులే...అది తినడం వల్లే ? | Oneindia Telugu

2017-11-18 2,569 Dailymotion

A North Korean soldier who was shot while fleeing across the border has an extremely high level of parasites in his intestines, his doctors say. Lee Cook-jong, who leads the team treating the soldier, said: "I spent more than 20 years of experience as a surgeon, but I have not found parasites this big in the intestines of South Koreans." <br /> <br />ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాలోకి ఓ సైనికుడు చొరబాటుకు యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా సైన్యమే అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.గాయాలపాలైన అతన్ని దక్షిణ కొరియా దళాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ఈ సందర్భంగా అతనికి శస్త్ర చికిత్స అందించిన వైద్యులు.. అతని శరీర పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఆ సైనికుడి శరీరంలోని ప్రతి అవయవ భాగంలోనూ వేల సంఖ్యలో పురుగులు ఉ‍న్నట్లు గుర్తించారు. <br />తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి దారుణమైన కేసును డీల్‌ చేయలేదని సైనికుడికి శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతని ఉదర భాగంలోని అవయవాల నుంచి 27సెం.మీ పొడవున్న పురుగును వెలికితీసినట్టు చెప్పారు. <br />ఆ సైనికుడి చిన్న పేగులో అయిత కొన్ని వందల కొద్ది గుండ్రని పురుగులు ఉన్నాయన్నారు వైద్యులు. ప్రస్తుతం సైనికుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఉత్తరకొరియా వ్యవసాయంలో 'నైట్ సాయిల్'గా పిలిచే మానవ మలాన్నే ప్రధాన ఎరువుగా వాడుతారు. ఆ కూరగాయలను తినడం వల్లే అతని శరీరంలో పురుగులు తయారైనట్టు వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో కొన్ని ప్రాణాంతకమైనవని, మరికొన్నింటివల్ల పెద్ద ప్రమాదమేమి ఉండదంటున్నారు.

Buy Now on CodeCanyon