Data released by NASA shows that even port city Kakinada in Andhra Pradesh also at a higher risk of flooding from rising sea levels because of melting glaciers than coastal cities such as Mumbai and New York. <br /> <br />రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత నగరం కాకినాడ కనుమరుగు కానుందా? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేసిన తాజా పరిశోధన ప్రకారం.. మన దేశంలో ముంబై, మంగళూరుతోపాటు కాకినాడకు కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తప్పదట. <br />ఈ మేరకు నాసా చేసిన హెచ్చరిక భారత తీర ప్రాంత నగరాలను వణికిస్తోంది. గ్లోబల్ వర్మింగ్(భూతాపం) కారణంగా అంటార్కిటికాలోని మంచు ఫలకాలు కరగడం వల్ల ప్రపంచంలోని 293 ప్రధాన పోర్టు నగరాలకు ముప్పు వాటిల్లనుందని నాసా టూల్ కిట్ జీఎఫ్‌ఎం ద్వారా వెల్లడైంది. <br />మన దేశంలో అయితే.. మహారాష్ట్రలోని ముంబయి, కర్ణాటకలోని మంగళూరుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తదితర తీర ప్రాంతాలకు ఎక్కువ ముప్పు ఉన్నట్లు నాసా పరిశోధన వెల్లడించింది. ఇప్పటికే కాకినాడలోని ఉప్పాడలో సముద్రం ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించిన ఈ అధ్యనం వివరాల్లో... భారత తీర ప్రాంత నగరాలకు ముప్పు వెంటనే రావచ్చు లేదా ఆలస్యంగా రావచ్చు. కానీ, ఎప్పటికైనా ముంపు ప్రమాదం తప్పదని నాసా పేర్కొంది.