Virat Kohli hit his 18th Test century, 50th of his international career, as India declared their second innings on 352/8, setting Sri Lanka 231 to win the first Test at Eden Gardens in Kolkata on Day 5. <br /> <br />కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. <br />అంతేకాదు ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకతం ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈడెన్‌లో చేసిన తొలి సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 88.4వ బంతిని సిక్స్‌గా మలిచి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకూ తన టెస్టు కెరీర్‌లో 18 సెంచరీలను నమోదు చేసిన కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్కటీ నమోదు చేయలేదు. <br />ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌లో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ లంచ్ విరామం తర్వాత సెంచరీని నమోదు చేశాడు.