Reports reveal Pawan is going to sing a new track for his new movie being directed by the wizard of words Trivikram Srinivas. The song is called ‘Kodaka....’ and this is the second song in their combo.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసాయి. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాటమరాయుదు లాంటి చిన్న డిసప్పాయింట్‌మెంట్ తర్వాత ఆసక్తికరమైన కాంబోతో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయ్.
ఈ సినిమాకి టైటిల్స్ గా చాలా ప్రచారం జరిగినా చివరకు "అజ్ఞాతవాసి" టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక పాట పాడాడంట.
పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం ‘అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడా' అంటూ ఓ సాంగ్ పాడిన విషయం తెలిసిందే.
తాజాగా వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న"అజ్ఞాతవాసి" అని టైటిల్ అనుకుంటున్న చిత్రంలో కూడా పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతున్నారనే వార్త ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది. "కాటమరాయుడా.." అంటూ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాడిన పవన్.. ఇప్పడు కూడా అదే టైప్‌లో ఓ జానపద గీతం పాడబోతున్నారట.
యంగ్ సంచలనం అనిరుధ్ సంగీత సారథ్యంలో పవన్ పాడబోతున్న ఈ పాట ‘కొడకా కోటేశ్వరావా' అనే లైన్స్‌తో ఉండబోతుందట. ఈ పాట ఈ చిత్ర ఆల్బమ్‌కే హైలైట్ అనే వార్తలు తాజాగా వ్యాపించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ యమా హడావిడిగా తమ ఫ్యాన్స్ పేజీల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు.