Surprise Me!

నాగ్, వర్మ మూవీ ఆ బ్లాక్‌బస్టర్‌కి కాపీ నా ? కథ తెలుసా?

2017-11-21 664 Dailymotion

Speculations are rife that the RGV flick with Nagarjuna is a copy of Hollywood hit film "Taken" (2008), which had Liam Neeson in the lead. Nagarjuna will be seen playing a Police Officer in the movie which Neeson did in the original. <br /> <br />శివ చిత్రం విడుదలై సుమారు పాతికేళ్లు దాటినా ఆ చిత్రం గురుంచి ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటాం.. పరిశ్రమలో ఆ చిత్రం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథను ప్రేక్షకులకు చెప్పే విధానాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ తరువాత కూడా వీరిద్దరూ అంతం, గోవిందా గోవిందా చిత్రాలకు కలిసి పనిచేశారు. ఆ తరువాత సుమారు 24సంవత్సరాల తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నాడు. <br />ఈ క్యారెక్టరైజేషన్ నచ్చడంతోనే నాగ్ వెంటనే కథకు ఓకె చెప్పాడట. అందరూ అనుకుంటున్నట్లు, ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓకె అయినది కాదుట. కొద్ది నెలలుగా దీనిపై డిస్కషన్లు నడుస్తున్నట్లు వినికిడి. ఆర్జీవీ తీయడం ఎలా తీస్తాడో కానీ, స్క్రిప్ట్, నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా సెట్ అయ్యాయని తెలుస్తోంది. <br />అందుకే నాగ్ ఒకె అనడం, సినిమా ప్రారంభం కావడం జరిగిపోతోంది. మరి వర్మ చూపించే పోలీస్ ఆఫీసర్ గా నాగ్ ఎలా వుంటాడో చూడాలి. అయితే ఈ సినిమా మీద వచ్చిన వార్త కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా సినిమా కథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణగా పొంది వర్మ తెరకెక్కించబోతున్నాడని గట్టిగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Buy Now on CodeCanyon