North Korea has reportedly banned gatherings that involve drinking alcohol and singing, in new measures designed to stifle the impact of crippling international sanctions over the hermit kingdom’s ongoing tests.

వరుస అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచం దేశాలను వణికిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సొంత దేశ ప్రజలను కూడా స్వేచ్ఛగా బతకనివ్వడం లేదు. ఇప్పటికే ఆ దేశంలో అనేక ఆంక్షలు అమల్లో ఉండగా.. తాజాగా మరికొన్ని ఆంక్షలు తీసుకొచ్చాడు. ఈ మేరకు దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి.
హైడ్రోజన్ బాంబు పరీక్షతో ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆర్థిక ఆంక్షల బారిన పడిన ఉత్తరకొరియా.. మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో ఎందుకీ వైరం? యుధ్ధ కాంక్ష మనకెందుకు? అన్న ఆలోచన ప్రజలకు రాకుండా వారిపై కఠిన ఆంక్షలు కిమ్ అమలు చేస్తున్నారని దక్షిణకొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఉత్తరకొరియా ప్రజలు వినోదాత్మక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రజలు సమూహంగా ఏర్పడటాన్ని కూడా నిషేధించారు.
కిమ్ ఆదేశాలతో ఉత్తరకొరియాలో మద్యం సేవించడం, పాటలు పాడడం, జనాలు గుమిగూడటంపై నిషేదాజ్ఞలు అమలవుతున్నాయి. ఈ నిషేదాజ్ఞలతో ప్రజలపై పట్టుసాధించడమే కాకుండా ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దోహదపడతాయని కిమ్ భావిస్తున్నారని దక్షిణకొరియా నిఘా సంస్థ వెల్లడించింది.