Malayalam and Tamil actor Arya, recently posted a video on Facebook and captioned it, "Hi friends, Finally in search of my Life Partner #MySoulmate " (sic).In the video, he said that he is looking to get married soon.

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించుకొన్న నటుల్లో ఆర్య ఒకరు. తనకు ఓ జీవిత భాగస్వామి కావాలి. త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ మాట్లాడిన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో ఆర్య పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో చాలా వైరల్‌గా మారింది. ఎంతకు ఆయన ఏమన్నారంటే..
హాయ్ ఫ్రెండ్స్, నా జీవిత ప్రయాణంలో మరో మజిలీకి చేరుకొన్నాను. నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. అభిమానులారా నా జీవిత భాగస్వామిని ఎంపిక చేయండి అని ఆర్య అన్నారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తున్నది.
అందరి మాదిరిగా నేను పెళ్లి వెబ్‌సైట్ల ద్వారా నా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోదలుచుకోలేదు. నాకు ఎలాంటి డిమాండ్లు, కండిషన్లు లేవు. ఎవరైనా నన్ను ఇష్టపడి, నాతో జీవితం బాగుంటుంది అని భావిస్తే నా నంబర్‌కు ఫోన్ చేయండి.. అంటూ ఓ ఫోన్ నెంబర్ ను ఇచ్చేసాడు.
నాకు జీవిత భాగస్వామిగా ఉండటానికి విడాకులు పొందిన, ఒంటరిగా జీవించే మహిళలైనా ఫర్వాలేదు అని ఆర్య అన్నారు. అంతేకాకుండా కుల, మత, భాష అనే పట్టింపులు నాకు లేవు అని ఓ ప్రకటనలో తెలిపారు.