Balakrishnudu hero Nara Rohith responded on affair with Regina. He said that he knows the gossip. but I have only professsional relationship with regina. Earler Regina given clarity about her carreer.

అందాల తార రెజీనా కసాండ్రాతో అఫైర్ వార్తలు మీడియాలో ఇటీవల బాగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్యలో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో రెజీనా పెళ్లి జరుగబోతున్నదనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. తాజాగా నారా రోహిత్‌తో రెజీనా అఫైర్ సాగుతున్నదనే వార్త సంచలనంగా మారింది.
రెజీనాతో లవ్ అఫైర్ నడుస్తోంది అని వస్తున్న వార్తలపై తాజాగా నారా రోహిత్ స్పందించారు. రెజీనాతో అఫైర్ అని వైరల్ అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదు. నేనేమీ సీరియస్‌గా తీసుకోలేదు అని నారా రోహిత్ అన్నారు.
గతంలో రెజీనాతో శంకర, జో అచ్యుతానంద చిత్రాల్లో నటించా. ప్రస్తుతం బాలకృష్ణుడు సినిమాల్లో కలిసి నటిస్తున్నాను. మొదటి సినిమా నుంచి ఈ గాసిప్ వినిపిస్తున్నది అని రోహిత్ అన్నారు.
తరుచుగా మేమిద్దరం కలిసి నటిస్తున్నాం. రూమర్, గాసిప్స్ వైరల్ కావడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది. మేము ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ షేర్ చేసుకున్నాం. అది తప్ప మా మధ్య మరో విషయం లేదు అని రోహిత్ తెలిపారు.