As per the sources Ram Charan's next with Boyapati Srinivas after compleated Rangasthalam 1985 in Sukumar Direction, and Koratala Siva Movie which has planed before got Shelved Once Again

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివతో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కొరటాల శివ నాలుగో సినిమా ఉండనుందని, ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ కూడా అప్పుడే మొదలైందని,. కొరటాల శివ ‘జనతా గ్యారెజ్' పూర్తి చేసేలోగా, రామ్ చరణ్ ‘తని ఒరువన్' రీమేక్‌ను పూర్తి చేసి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేసారనీ చెప్పుకున్నారు.
అయితే తర్వాత ఏమైదోగానీ చరణ్ సుకుమార్ సినిమా కన్నా ముందే రామ్ చరణ్, కొరటాల శివల కాంబినేషన్ లో సినిమా చర్చ ప్రారంభమైంది. అయితే ఆ సినిమాను పక్కన పెట్టేసిన చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ రంగస్థలం 1985ను స్టార్ట్ చేశాడు, కొరటాల మహేష్ తో "భరత్ అనే నేను" మొదలు పెట్టాడు.
అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తర్వాత కూడా చరణ్ తన నెక్స్ట్ మూవీని బోయపాటి శ్రీనుతో చేయనున్నట్టుగా తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే బోయపాటి బిజీగా ఉన్నాడనీ, వచ్చేనెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని అంటున్నారు.