The “local films” he is referring to are real-life private videos that are now the fastest selling commodities in this market <br /> <br />ఓ యువకుడు ఓ యువతిపై అత్యాచారం చేయడమే దారుణం అనుకుంటాం. కానీ అంతకంటే దారుణమైన విషయమిది. అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు అంగళ్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఒకప్పుడు పైరేటెడ్ సినిమాల విక్రయించిన కొంతమంది వ్యాపారులు ఇప్పుడు ఈ అత్యాచార వీడియోలను జోరుగా అమ్ముతున్నారు. వీటిని 'లోకల్ ఫిలిమ్స్' అని పిలుస్తున్నారు. అదేమంటే.. ఇప్పుడు వీటికే డిమాండ్.. యువకులు, విద్యార్థులు అడుగుతున్నారు అంటున్నారు. <br />ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించే నాకా హిందోళ మార్కెట్ లో ఇప్పుడో కొత్త దందా నడుస్తోంది. ఈ మార్కెట్ లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. అత్యాచార వీడియోలకు డిమాండు పెరగడంతో కొందరు వ్యాపారులు వీటిని గుట్టుగా లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్‌లలో వేసి విక్రయిస్తున్నారు.తెల్లవారక ముందే నాకా హిందోళ మార్కెట్ లో ఈ రకమైన వ్యాపారం మొదలవుతోంది. కొన్ని షట్టర్లు సగమే తెరిచి ఉంటాయి. ఆయా దుకాణాల వద్దకు వచ్చిన యువకులు వాళ్లకేం కావాలో గుసగుసగా చెప్పి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళతారు. తిరిగి వాళ్లు వచ్చేసరికి ఆ పెన్ డ్రైవ్ లలో వారు కోరుకున్న సంఖ్యలో అత్యాచార వీడియోలు సిద్ధంగా ఉంటాయి.