Surprise Me!

BrahMos Success Story

2017-11-23 424 Dailymotion

With the successful test of the air launched version of India's BrahMos the Indian Air Force will now have the ability to strike hostile warships and ground targets more than 400 kilometres away with precision accuracy and within minutes of being ordered to strike. <br /> <br />భారత రక్షణదళాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖితమైంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం అయింది. ఇప్పటికే భూమిపైనుంచి, సముద్రంపైనుంచి జరిపిన పరీక్షల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న బ్రహ్మోస్.. తాజాగా గగనతలంలోనూ నిప్పులు చిమ్ముతూ, ప్రచండవేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించింది. బుధవారం మధ్యాహ్నం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి తొలిసారిగా బ్రహ్మోస్‌ను పరీక్షించామని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. బ్రహ్మోస్-ఎయిర్‌లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ (ఏఎల్సీఎం) ప్రయోగాన్ని రెండు దశల్లో చేపట్టగా, బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని తెలిపింది. ఈ ప్రయోగంతో 2.5టన్నుల బరువు గల బ్రహ్మోస్ క్షిపణికి 290కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉన్నదని మరోసారి నిరూపణ అయ్యిందని రక్షణశాఖ పేర్కొన్నది. తద్వారా భారత రక్షణ శాఖ మరో మైలురాయిని చేరుకున్నది.

Buy Now on CodeCanyon