Tamil Nadu Politics : MLAs, EPS turns attention to Palaniswamy, Panneerselvam side

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంతకాలం చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్ భజన చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెలు, ఎంపీలు ఇప్పుడు ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోకి జంప్ కావడానికి రాయభారం నడుపుతున్నారు. ఇలాగే ఉంటే మొదటికే మోసం వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులతో చర్చలు జరిపి వెంటనే ఆ వర్గంలోకి జంప్ అయ్యి తమ పదవులు కాపాడుకోవాలని రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ సర్వాధికారాలు ఇప్పుడు పళనిసామి, పన్నీర్ సెల్వం చేతిలో ఉన్నాయి. ఇప్పటికే దినకరన్ గ్రూప్ లోని 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు.
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం వ్యవహారం ఎన్నికల కమిషన్ దగ్గర ఉందని, మేము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టులో ఉంది. అయితే అన్నాడీఎంకే పార్టీ తమిళనాడు ప్రభుత్వం చేతికి వెళ్లడంతో ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు.