In Kanyakumari, a cop was caught lath charging a biker for not wearing helmet. After the incident took place, there has been a huge uproar over the act of Tamil Nadu policeman and every citizen has criticized him for the inhumane act. <br /> <br />తమిళనాడు పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. హెల్మెట్ పెట్టుకోకపోతే రూ. 200 అపరాదరుసుం విధించాలి. లేదంటే కేసు నమోదు చెయ్యాలి. అంతే కాని చేతిలో లాఠీ ఉంది కదా అంటూ ఓ పోలీసు అధికారి రెచ్చిపోయాడు. ఏఎస్ఐ లాఠీతో అమాయకుడైన యువకుడి తల పగలగొట్టారు. తమిళనాడులో ప్రసిధి చెందిన పర్యటక కేంద్రం కన్యాకుమారి జిల్లాలో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టారు పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న దేవరాజ్ స్థానికంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు చేస్తుంటారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. <br />ఆ సందర్బంలో అటు వైపు ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా బైక్ లో వెళ్లారు. హెల్మెట్ లేకుండా వెలుతున్న వారిని ఏఎస్ఐ దేవరాజ్ అడ్డుకునేందేకు ప్రయత్నం చేశాడు. బైక్ లో వెలుతున్న యువకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ఏఎస్ఐ దేవరాజ్ తన లాఠీకి పని చెప్పాడు. యువకులు వెలుతున్న బైక్‌ను వెంబడించి వారి తల మీద లాఠీతో దాడి చేశారు. ఆ సందర్బంలో బైక్ లో వెనుక కూర్చున్న రాకేష్ అనే యువకుడి తలను లాఠీతో పగలకొట్టాడు. <br />