Prime Minister Narendra Modi was impressed by the Hyderabad Metro Rail on Tuesday, according to government officials accompanying him during the inaugural ride from Miyapur to Kukatpally and back. <br /> <br />హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా సరదాగా గడిపారు. మెట్రో స్టేషన్లు, కోచ్‌లు అద్భుతంగా ఉన్నాయని మోడీ కితాబిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా 'నేను ముందుకు నడపాల్సింది రైలును కాదు... దేశాన్ని' అని మోడీ అధికారులతో వ్యాఖ్యానించడం అందర్నీ నవ్వుల్లో ముంచింది. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణిస్తూ- ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు సంస్థ ఎండీ శివానంద నింబార్గిని ఉద్దేశించి ఈ మాటలన్నారు. మియాపూర్-కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ల నడుమ 11 నిమిషాల ప్రయాణంలో మోడీ అనేక విషయాలను ప్రస్తావించారు. <br />హైదరాబాద్ మెట్రోరైలు లోకో పైలట్ (డ్రైవరు)తో పెద్దగా సంబంధం లేకుండానే, ఉప్పల్ డిపోలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం ఆధారంగా నడుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌లో తిరిగే 57 రైళ్లలో మహిళలనే లోకో పైలెట్లుగా నియమించింది.