Recently, Shruti Haasan made her boyfriend Michael meet her mom Sarika. And pictures of the trio spotted together have gone viral. <br /> <br />ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుటుంబంలో పెళ్లి భాజా మ్రోగ బోతోందా? ఆయన కూతురు, హీరోయిన్ శృతి హాసన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి చెన్నై సినీ వర్గాల నుండి. శృతి హాసన్ ఓ విదేశీయుడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటాలియన్ సంతతికి చెందిన మైఖేల్ కోర్సేల్‌తో శృతి హాసన్ కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. లండన్లో స్టేజ్ యాక్టర్‌గా రాణిస్తున్న మైఖేల్ తన ప్రియురాలు శృతి హాసన్ కోసం చాలా సార్లు ఇండియా వచ్చారు. <br />త్వరలో శృతి హాసన్, మైఖేల్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరూ కమల్ హాసన్ తో చర్చించినట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే త్వరలో కమల్ హాసన్ ఇంట్లో శుభకార్యం చూడబోతున్నాం. <br />శృతి హాసన్ ఏ విషయంలో అయినా ఓపెన్ మైండెడ్. ఎలాంటి దాపరికాల్లేకుండా శృతి హాసన్, మైఖేల్ ఇండియాలో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.