There is no official information from makers about Ravi Teja characterization in "Touch chesi Chudu" movie. But, few pics are leaked from the shooting location describes that Ravi Teja playing a cop role in this film.

మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం అభిమానులు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో డీసెంట్ హిట్ సాధించిన రవితేజ, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న తరుణంలో ఆగిపోవటంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అన్ని రోజుల తర్వాత వచ్చినా రాజా ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఈ హిట్ తో రవితేజ మార్కెట్ మళ్ళీ ఊపందుకుంది.
రాజా ది గ్రేట్ మూవీతో తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న రవితేజ.. ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇప్పుడు రవితేజ నెక్ట్స్ మూవీపై ఆసక్తి పెరిగిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను సంక్రాంతి రేస్ లో నిలిపినట్లు నిర్మాతలు ఇప్పటికే చెప్పేశారు. అయితే.. ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ ముందు విడుదల చేసిన మోషన్ టీజర్ తప్ప.. అసలు ప్రమోషన్ వర్క్స్ కూడా మొదలు కాలేదు.
టచ్ చేసి చూడు మూవీలో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఓ పోస్టర్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారిపోయింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కళ్లజోడు పెట్టుకున్న రవితేజ లుక్ నిజంగానే సూపర్బ్ గా ఉంది.