Avika is said to have realised that she is not having the right qualities to become a star heroine and has decided not to take up acting anymore. <br /> <br />ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. <br />"చిన్నారి పెళ్లికూతురు" సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది అవికా గోర్. ఆమె తెలుుగలో నటించిన తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల' సూపర్ హిట్. ఆ తర్వాత కూడా ఆమెకు ‘సినిమా చూపిస్త మావ'.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్లున్నాయి. <br />అయినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. ఇక్కడ అవకాశాలు రాక.. బాలీవుడ్లోనూ ఛాన్సులు లేక హీరోయిన్ గా అడుగులు ముందుకు వేయలేకపోయింది అవికా. ఆమె ఇక సినిమాలు చేయాలనుకోవట్లేదని.. మళ్లీ సీరియళ్లలోకి వెళ్లిపోవాలనుకుంటోందని వార్తలు వచ్చాయి.