Kohli is the fourth quickest Indian to reach the 5,000 club. The ones reaching the mark before him are Sunil Gavaskar (95 innings), Virender Sehwag (98 innings), Sachin Tendulkar (103 innings), while Kohli reached there in 105 innings, before Rahul Dravid (108 innings). <br /> <br />ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టులో తొలిరోజు 25 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. <br />విరాట్ కోహ్లీకి ఇది 63వ టెస్టు. ఇన్నింగ్స్‌లో లక్మల్ వేసిన 30.3వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 105 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
