Surprise Me!

Rahul Gandhi files nomination for Congress president's post

2017-12-04 198 Dailymotion

Congress Vice-President Rahul Gandhi is all set to file the nomination papers for the post of party chief, today. <br /> <br />కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. సీనియర్ నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తదితర నేతలు ఆయనను ప్రతిపాదించారు. 4 సెట్లపై 40 మంది సంతకాలు చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాహుల్ గాంధీకి ఎవరూ పోటీ లేనందున ఆయనను ఈ రోజే అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలి వచ్చారు. నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఆరో వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఇరవై ఏళ్లు కొనసాగారు. ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఇంతకాలం ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 9, 14 తేదీల్లో జరుగుతాయి. ఈ దఫా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మతాల ప్రాతిపదికన కాక కులాలు.. వివిధ సామాజిక వర్గాల మధ్య రాజకీయ పునరేకీకరణ దిశగా సాగుతున్నాయి. <br />

Buy Now on CodeCanyon