Surprise Me!

నాగ్ సినిమాకు క్రేజీ టైటిల్

2017-12-05 1,476 Dailymotion

After 28 years, Nagarjuna, Ram Gopal Varma movie has repeated. Varma and Naga's new police cop movie which started on November 20 at Annapurna Studios. <br /> <br />టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం శివ. అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచనల విజయం సాధించింది. అలాంటి చిత్రం రూపొందిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్, వర్మ కాంబినేషన్ రీపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎలాంటి పేరు పెడుతారో అనే ఓ సందేహం ఫ్యాన్స్‌ను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన టైటిల్స్ వెలుగులోకి వచ్చాయి. <br />వర్మ రూపొందించబోయే సినిమాలో నాగార్జున పోలీస్ అధికారిగా నటించనున్నాడనేది తాజా సమాచారం. పోలీస్ కథ అంటే అండర్ కరెంట్‌గా మాఫియా స్టోరి కంపల్సరీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లలో తుపాకులు, పిస్టల్స్‌తో అదరగొట్టేశాడు. ఈ సినిమా కథకు సరిపోయే విధంగా విభిన్నమై టైటిల్‌ను పరిశీలీస్తున్నట్టు తెలుస్తున్నది. <br />కథ డిమాండ్ మేరకు, నాగ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి గన్‌, సిస్టమ్‌ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారట. అయితే టైటిల్‌ తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్‌లో ఉంటుందా అనే విషయంపై క్లారిటీ లేదు. అర్జున్‌రెడ్డి మాదిరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

Buy Now on CodeCanyon