Varun Tej's Toli Prema First look released. Mega Prince Varun Tej’s new film under the popular production house of Sri Venkateswara Cine Chitra has been titled as Tholiprema.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం తొలి ప్రేమ. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పోస్టర్, ఇందులో వరుణ్ తేజ్ లుక్ చూసిన అభిమానులు..... వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేస్తున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 1998లో 'తొలిప్రేమ' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బెస్ట్ చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. ఇపుడు అదే టైటిల్‌తో వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా వస్తోంది.
ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశి ఖన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ మూవీకి, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేక పోయినా..... అదే స్థాయిలో ఈ చిత్రం హిట్ అవుతుందని భావిస్తున్నారు.
డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈచిత్రం జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
‘తొలి ప్రేమ' టైటిల్ అంటేనే తెలుగు సినిమా అభిమానుల్లో, ముఖ్యంగా మెగా అభిమానుల్లో ఏదో తెలియని క్రేజ్ ఉంది. ఇపుడు ఇదే టైటిల్‌తో మెగా ఫ్యామిలీ హీరో నుండి మరో సినిమా వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.