Arjun Reddy movie fame Vijay Devarakonda sensational comments on Kannada cricketers, film stars. He attended Ganesh movie Chamak audio release function as chief guest. <br /> <br />పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ఘన విజయాలతో క్రేజీస్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హవా దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీగానే నడుస్తున్నది. కన్నడ నటుడు గణేష్ నటించిన చమక్ చిత్ర ఆడియో ఆవిష్కరణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడియో ఆవిష్కరణ అనంతరం విజయ్ మాట్లాడుతూ కన్నడ ప్రముఖుల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసి ఆకట్టుకొన్నారు. విజయ్ ఏమన్నారంటే... <br />కర్ణాటక అనగానే రాహుల్ ద్రావిడ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ లాంటి ప్రముఖ క్రికెటర్లు వెంటనే గుర్తుకు వస్తారు. భారత జట్టులో ఎక్కువ మంది కర్ణాటక నుంచే ఉంటారు. ఒక్క క్రికెట్ కాదు.. ఏ రంగానికి చెందిన వారైనా అంకితభావంతో సేవలందిస్తారు. <br />సినిమాల గురించి ఆలోచించగానే బాహుబలి లాంటి చిత్రంతో పాపులర్ అయిన అనుష్కశెట్టి కర్ణాటక నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఇంకా సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లాంటి వారిని కూడా ఈ రాష్ట్రమే అందించింది. త్వరలోనే రష్మిక మందన కూడా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నది.