Surprise Me!

పవన్.. ఫ్యాన్స్ ఆశలు వదులుకోవడమేనా ? | Filmibeat Telugu

2017-12-07 1,976 Dailymotion

Film Nagar source said that, No Audio launch event for Pawan Kalyan's upcoming film Agnathavasi. Songs will be released directly in online. <br /> <br />పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సాధారణంగా అయితే ఆస్థాయి హీరో సినిమా వస్తుంది అంటే ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఇంటర్వ్యూలు అంటూ సందడిగా ఉంటుంది. అయితే 'అజ్ఞాతవాసి' విషయంలో అలాంటి సందడి కనిపించడం లేదు. <br />‘అజ్ఞాతవాసి' సినిమా విషయంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లాంటి జరుగుతాయని అభిమానులు ఆశలు పెట్టుకోవద్దనే వాదన వినిపిస్తోంది. ఈ సినిమా విషయంలో అలాంటివేమీ ఉండవని, ఫ్యాన్స్ ఈ విషయంలో అశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. <br />‘అజ్ఞాతవాసి' సినిమా విషయంలో ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ నిర్వహించడం అవసరం లేదని, ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం. ఒక వేళ నిర్వహించిన తాను మాత్రం రాను అని పవన్ చెప్పేశాడట.

Buy Now on CodeCanyon