The makers of actor Ram Charan’s upcoming Telugu romantic drama Rangasthalam have announced that the first look of the film will be unveiled on December 8 at 5.30 pm.

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫస్ట్ లుక్ విడుదల తేదీని ప్రకటించారు.
‘రంగస్థలం' 1985' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం కేవలం అభిమానులే కాదు, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా వెయిట్ చేస్తోంది. చరణ్ విషయం ప్రకటించగానే ఆమె ఎగ్జైట్మెంటుతో ట్వీట్ చేశారు.
'రంగస్థలం' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1985 నాటి పరిస్థితులతో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కోరీర్లోనే ఒక డిఫరెంట్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది.
ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే..... మరో వైపు బిజినెస్ కూడా మొదలైంది. డీఎస్పీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ వారు రూ. 1.60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.