Yaduveer Krishnadatta Chamaraja Wodeyar and his wife Trishika Kumari welcomed the new born baby to the family on Wednesday. <br /> <br />నాలుగు శతాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు మైసూరు రాజవంశానికి వారసుడొచ్చాడు. మైసూరు రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్- త్రిషికా కుమారి సింగ్ దంపతులకు బుధవారం కుమారుడు జన్మించాడు. దీంతో రాజవంశంతో పాటు మైసూరు అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. <br />మైసూరు యువరాణి త్రిషికా బుధవారం ఉదయం పురుటి నొప్పులతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. రాత్రి పొద్దుపోయాక ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. <br />మైసూరు యువరాజు యదువీర్ దంపతులకు కుమారుడు జన్మించడంతో సుమారు 400 ఏళ్ల నాటి శాపానికి విముక్తి కలిగిందని మైసూరు రాజ కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.