Renowned filmmaker Gautham Vasudev Menon met with a car accident in Chennai today. The accident took place between 3.30 and 4 in the morning on the East Coast Road, where his Mercedes Benz was hit by a lorry. <br /> <br />ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవన్ మీనన్ కారు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో గౌతమ్ మీనన్ తృటిలో ప్రాణాలను కాపాడుకోవడంతో ఊపిరి పీల్చుకొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.. <br />డిసెంబర్ 7వ తేదీ తెల్లవారు జామున ఉదయం 3.30 నుంచి 4 గంటల మధ్య చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ప్రయాణిస్తున్నారు. తాను ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఓ లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో డ్రైవర్, గౌతమ్ మీనన్ ప్రాణాలతో బయటపడ్డారు. <br />కారు ప్రమాదంలో డ్రైవర్‌కూడా స్పల్పంగా గాయాలైనట్టు తెలిసింది. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌పై గ్యుండీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం.
