Surprise Me!

Pawan Kalyan Tour : డబ్బుతింటే ఎలా బతుకుతారు? YSR చనిపోతారని ఊహించారా? | Oneindia Telugu

2017-12-08 2,059 Dailymotion

Janasena President Pawan Kalyan made sensational comments on CM Chandrababu Naidu. He said if Babu have not become CM he definitely lost life already.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు. అటు అధికార పక్షంపై ఇటు ప్రతిపక్షంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంపై ఇప్పటికీ తనకు నమ్మకముందని గతంలో మాదిరే విధేయతను ప్రదర్శిస్తున్నారు.
అలాగే రాజకీయాలకు తాను ఏవిధంగా సమర్థుడినో పరోక్షంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో భాగంగా సుమారు గంటా 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ ల నేపథ్యంపై.. కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో స్పందించారు.
టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి ఉండేవాడినని కానీ ఓట్లు చీల్చడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఆ సమయంలో టీడీపీ-బీజేపీలకు మద్దతు తెలిపినందుకు చాలామంది తనను ప్రశ్నించారని, ఈ విషయంలో చాలామందితో గొడవ కూడా పడ్డానని తెలిపారు.

Buy Now on CodeCanyon