A couple of days ago there were reports that VJ Manimegalai has registered a complaint on father and brother for physical harassment and later the anchor denied stating it is just an emotional misunderstanding because of her relationship.

కొన్ని రోజుల క్రితం తండ్రి, సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కిన తమిళ టీవీ యాంకర్ మణిమెగలై తాజాగా తన ప్రియుడిని రహస్య వివాహం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ద్వారా విషయం తెలియజేస్తూ ఫోటోలు పోస్టు చేశారు.
తన తండ్రి, సోదరుడు తనను శారీరకంగా హింసిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం మణిమెగలై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయంలోనే ఇంట్లో గొడవ జరుగడంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదు అనంతరం మాట మార్చిన మణిమెగలై.... ఏదో ఆవేశంలో వారిని అపార్థం చేసుకున్నానని, తమ లవ్ రిలేషన్ కారణంగా చిన్న పాటి మిస్‌అండర్ స్టాండింగ్ జరిగిందని తెలిపారు.
ఈ వివాదం అనంతరం మణిమెగలైన తన బాయ్ ఫ్రెండ్ హుస్సేన్‌ను రహస్య వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నేను ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లాడాను. సడెన్ రిజిస్టర్ మ్యారేజ్. మా నాన్నను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాను. అందుకే ఇలా చేసుకోవాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు ఆయన అర్థం చేసుకుంటాడని బలంగా నమ్ముతున్నాను... అని మణిమెగలై ట్వీట్ చేశారు.