Surprise Me!

Pawan Kalyan Is Quitting From Films

2017-12-08 2 Dailymotion

Jana Sena party chief Pawan Kalyan on Friday said that he is quitting from films.

తాను సినిమాలను వదిలేస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. మధ్యలో కుదిరితే సినిమాలు చేస్తానని చెప్పారు. కానీ ఆయన తాజాగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
మంగళగిరిలో పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ఇలా వచ్చి అలా వెళ్తున్నానని కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తనకు పార్టీ కార్యాలయం దేవాలయం వంటిది అని చెప్పారు. వైసీపీ నాయకులు రోజా తదితరులు ఆయనను ఇదే విషయమై పదేపదే ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రిని అయితే ఓరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను మరో రకంగా ఉండనని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ఎప్పుడూ ఓకేలా ఉంటానని చెప్పారు. తాను సీఎంను అయితే సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. వారు పవన్.. పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ.. మీ ఉత్సాహం ఓట్ల రూపంలో చూపించాలని వారికి సూచించారు.

Buy Now on CodeCanyon