Senior Film Writer Diwakar Madabhushi responded over Pawan Kalyan head shave issue. He shared his conversation with Paritala Ravi on this issue. <br /> <br />పవన్ కళ్యాణ్ తన తాజా ప్రసంగాల్లో 'గుండు' ప్రస్తావన తీసుకురావడం పెద్ద చర్చనే లేవనెత్తింది. అటు మీడియా చానెళ్లలోను, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద డిబేట్ జరిగింది. <br />పవన్ అసలు ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించకుండా ఉండాల్సింది అనేవారు కొందరైతే.., ఇప్పటికైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టే పనిచేశారని మెచ్చుకుంటున్నవారు మరికొందరు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ 'గుండు' వ్యవహారంపై హాట్ హాట్ చర్చ సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సినీ రచయిత దివాకర్ మాడభూషి సైతం ఈ విషయంపై స్పందించారు. తన అనుభవంలోకి వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. <br />అప్పట్లో పరిటాల రవి ఫిలిం నగర్ లోని ఆయన ఇంటికి పిలిపించి.. తనకో పాయింట్ చెప్పారని, దానిపై కథ చేయమన్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు.కథ రెడీ అయ్యాక అనంతపురం రమ్మని తనకు కబురుపెట్టారని దివాకర్ మాడభూషి పోస్టులో తెలిపారు. ఆయన చెప్పినట్లే తాము అక్కడికి వెళ్లామని, వెళ్లేసరికి ఆయన ఇంటికి మరమ్మత్తులు చేస్తుండటంతో తమను ఓ గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లారని అన్నారు. అక్కడ పరిటాల రవికి తాను కథ వివరించానని, కానీ అనుకున్న విధంగా రాలేదన్న కారణంతో మళ్లీ వర్క్ చేయమని పరిటాల చెప్పినట్లుగా వివరించారు.