Celebrity Lovebirds, ace cricketer Virat Kohli and actor Anushka Sharma are expected to get married in the next few days. In this situation, Astrologers have predicted.

బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. కొద్దికాలంగా ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్న వారు ఇటలీలోని మిలాన్‌లో వివాహం చేసుకొంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
విరుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పలు చానెళ్లు చర్చ కథనాలను ప్రసారం చేశాయి. ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన చర్చ కార్యక్రమంలో జ్యోతిష్కుడు మాలవ్ భట్ మాట్లాడుతూ.. అనుష్క, విరాట్ మధ్య భావోద్వేగమైన విభేదాలు రావడానికి అవకాశం ఉంది. ఆ కారణంగా వారి దాంపత్య జీవితానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అని వెల్లడించారు.
జోతిష్యం ప్రకారం విరుష్క వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడటానికి అవకాశం ఉంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక ఒడిదుడుకులు ఏర్పడుతాయి. దాంతో వారి జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది అని పలువురు జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు.
జోత్యిష్కుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విరుష్క పెళ్లి ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే వారి బంధువులు, సన్నిహితులు ఇటలీకి ప్రయాణమయ్యారు.
తాజా సమాచారం ప్రకారం అనుష్క, విరాట్ పెళ్లి డిసెంబర్ 15న జరుగుతుందని తెలుస్తున్నది. డిసెంబర్ 21న ముంబైలో మ్యారేజ్ రిసెస్పన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్‌ను బుక్ చేసినట్టు సమాచారం.