The ‘Chaddi Gang’ is in the city. And the cops want you to be alert. A few CCTV grabs, apparently from Ghatkesar and Mathrusri Nagar in Kukatpally. <br /> <br />నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు మరోసారి కలకలం రేపారు. ఘట్‌కేసర్ పోలీస్ పరిధిలోని రాత్రివేళ చెడ్డీ గ్యాంగ్ మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించింది. వారికి విలువైన వస్తువులు దొరక్క పోవడంతో చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్లారు.కాగా, ఆయా గ్రామాల్లో వీరు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడం గమనార్హం. దీంతో నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందనే ఆధారాలు రాచకొండ పోలీసులకు లభించినట్లయింది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, గ్రామ శివార్లలో ఉన్న ఇళ్లనే వీరు లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు చెబుతున్నారు. <br />మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్‌లు నగరంలోని, శివారులోని ప్రాంతాల్లో దోపిడీలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఒక్కో గ్యాంగ్‌లో పది మంది వరకు ఉంటారు. వీరు మారణాయుధాలతో సంచరిస్తుంటారు.దోపిడీ సమయంలో ఎవరైనా అడ్డగిస్తే ప్రాణాలు తీసేందుకు సైతం వీరు వెనుకాడరు. దీంతో ఈ గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి, ముఖానికి ముసుగు వేసుకుంటారని తెలుస్తోంది.
