Hollywood make-up man Vance Hartwell opened up about Jai Lava Kusa contraversy. He said that Kalyan Ram was treated extremely well. Kalyan Ram was professional and paid on time.

ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జైలవకుశ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. అయితే అందులో కీలకమైన జై పాత్ర రూపురేఖలను విభిన్నంగా తీర్చి దిద్దడం కోసం హాలీవుడ్ నుంచి వాన్స్ హార్ట్‌వెల్‌ను రప్పించారు. తొలుత విలన్ షేడ్స్ ఉండే జై పాత్ర కోసం వికృతంగా ఉండే విధంగా మేకప్ వేసి కొన్ని స్టిల్స్ లీక్ చేశారు. అయితే తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాంటి మేకప్ అసలు కనిపించకపోవడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించింది.
మేకప్‌మ్యాన్ వాన్స్ హార్ట్‌వెల్ అద్భుతంగా ఎన్టీఆర్‌ను కొత్తలుక్‌లో తీర్చిదిద్దాడట. అయితే అతను చేసిన మేకప్‌ను వాడుకోలేదని, అతడిని మధ్యలోనే పంపించారు అని ఓ రూమర్ ఫిలింనగర్‌లో షికారు చేసింది.
అంతేకాకుండా వాన్స్ హార్ట్‌వెల్‌కు సరిగా పారితోషికం కూడా ఇవ్వలేదు. సినిమాకు కష్టపడినందుకు తగిన ప్రతిఫలం దక్కలేదు అనే వార్తలు బయట వినిపించాయి.
జై లవకుశ సినిమా రిలీజ్ అయి ఘనవిజయం సాధించడం, జై పాత్రకు మంచి పేరు రావడంతో ఈ రూమర్లను పట్టించుకోలేదు. తాజాగా ఈ రూమర్‌పై హాలీవుడ్ టెక్నిషియన్ స్పందించనట్టు మీడియాలో వార్త ఒకటి ప్రచారం జరుగుతున్నది.