Surprise Me!

రాజేష్ ఆత్మహత్యాయత్నం, అంతా వాట్సాప్ నే ! స్వాతి కేసులో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

2017-12-13 9 Dailymotion

Swathi was arrested and Rajesh tried to commit lost life at the hospital. <br /> <br />ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిన స్వాతి ఉదంతంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. కొడుకు పుట్టినరోజే భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి మట్టుబెట్టడం గమనార్హం. ఆపై ప్రియుడు రాజేష్ ను భర్త స్థానంలోకి తీసుకొచ్చేందుకు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయింది. తల్లి చేసిన పనికి ఆ బిడ్డలు అటు తండ్రి ప్రేమకు, ఇటు ఆమె ప్రేమకు నోచుకోకుండా పోయారు. అత్తింటివారు, పుట్టింటివారు, గ్రామస్తులు.. ఇలా ఆమెను శాపనార్థాలు పెట్టనివాళ్లు లేరు <br />నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత నెల 27న ప్రియుడితో కలిసి స్వాతి తన భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చింది. యాథృచ్చికంగా అదే రోజు సుధాకర్-స్వాతిల కొడుకు దర్శిత్ రెడ్డి ఏడో పుట్టినరోజు. ఆ రాత్రే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ఆపై పెట్రోలు పోసి కాల్చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ తర్వాత సీన్ లోకి రాజేష్ ఎంట్రీ ఇచ్చి యాసిడ్ నాటకానికి తెర లేపారు. <br />ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో స్వాతి సుధాకర్ రెడ్డి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా ఆసుపత్రికి వచ్చారు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో సుధాకర్ రెడ్డి స్థానంలో ఉన్న రాజేష్ కు చికిత్స అందిస్తున్నప్పుడే తల్లికి అనుమానం వచ్చింది. అయితే యాసిడ్ దాడి తర్వాత కొడుకు శరీరంలో వచ్చిన మార్పులేమో అని సర్దిచెప్పుకుంది.

Buy Now on CodeCanyon