Surprise Me!

India vs Sri Lanka : వన్డేల్లో 100 సార్లు 300 కి పైగా పరుగులు, అగ్రస్ధానంలో భారత్

2017-12-14 39 Dailymotion

India became first team to register scores of 300 or above for the 100th time in one-day internationals. <br /> <br />మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 208 , శ్రేయాస్ అయ్యర్ 88, ధావన్ 68 పరుగులు చేశారు. <br />ఈ మ్యాచ్‌తో టీమిండియా వన్డేల్లో మొత్తంగా 300పైచిలుకు స్కోరు చేయడం ఇది వందోసారి. 1996లో షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు సెంచరీలు సాధించడంతో తొలిసారి 305తో టీమిండియా ఈ మార్క్‌ని అందుకుంది. <br />చివరగా ఇటీవల న్యూజిలాండ్‌పై కాన్పూర్ వేదిక జరిగిన వన్డేలో 337 పరుగులు చేసింది. ఈ వన్డేలోనూ రోహిత్ శర్మ 147 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (113) పరుగులు చేసి సెంచరీలతో మెరిశారు. ఇప్పుడు మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 300పైచిలుకు పరుగులు చేసింది.

Buy Now on CodeCanyon